ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీదేవి ధరించింది అసలైన బంగారమే!

Sat, Jun 27, 2015
శ్రీదేవి
శ్రీదేవి
సాధారణంగా సినిమాల్లో నకిలీ కరెన్సీ .. రోల్డ్ గోల్డ్ ఆభరణాలను ఉపయోగిస్తూ వుంటారు. కానీ ఇటీవల 'రుద్రమదేవి' సినిమా కోసం అనుష్క ఒరిజినల్ ఆభరణాలను ధరించింది. అదే విధంగా 'పులి' చిత్రంలో మహారాణిగా శ్రీదేవి ధరించిన ఆభరణాలు కూడా నిజమైన బంగారంతో చేసినవేనట. ఈ విషయాన్ని ఈ చిత్రనిర్మాతలు శిబు తమీన్స్ .. సెల్వకుమార్ స్పష్టం చేశారు. ఈ సినిమాకి శ్రీదేవి ప్రధాన ఆకర్షణ అవుతుందనీ .. మహారాణిగా ఆమె నటన అద్భుతమని వాళ్లు చెప్పారు.

ఈ పాత్రకోసం 10 కేజీలకి పైగా బరువున్న బంగారు ఆభరణాలను ఆమె ధరించిందనీ, నాలుగు గంటల సమయం తీసుకునే మేకప్ విషయంలో ఆమె ఎంతగానో సహకరించిందని అన్నారు. ఈ సినిమా కోసం ఆమె కత్తి యుద్ధంతో కూడుకొన్న సన్నివేశాల్లో నటించడం విశేషమని చెప్పారు. విజయ్ జోడీగా శృతి హాసన్ .. హన్సిక నటించడం, మరో ముఖ్యపాత్రను సుదీప్ పోషించడం వలన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయనీ, ఆగస్టు చివరివారంలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)