ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ సినిమాలో అనీషా లేనట్టే!

Wed, Jun 24, 2015
అనీషా ఆంబ్రోస్
అనీషా ఆంబ్రోస్
మొదటి నుంచి కూడా 'గబ్బర్ సింగ్ 2' సినిమాలో ఒక కథానాయికగా 'అనీషా ఆంబ్రోస్' పేరు వినిపిస్తూనే వచ్చింది. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆమె లేదని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే విషయంలో ఆలస్యం జరగడం వలన అనీషా ఇతర సినిమాలతో బిజీగా ఉందా? లేదంటే మరో కథానాయిక అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు ఆలోచన చేశారా? అనేది ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశమైంది.

ఏదేవైనా పవన్ జోడీ కట్టే మరో కథానాయిక ఎవరనే ప్రశ్నే ఇప్పుడు యూత్ లో ఆసక్తిని రేకెత్తించనుంది. మొదటి షెడ్యూలు పూర్తి చేసుకుని, జూలై రెండోవారంలో జరగనున్న రెండో షెడ్యూలుకి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్లో పవన్ కల్యాణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)