ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్లైమాక్స్ చిత్రీకరణలో త్రిపుర

Tue, Jun 23, 2015
స్వాతి
స్వాతి
'త్రిపుర' అనే పేరు వినగానే ఇది కొంచెం మురిపిస్తూ .. మరికొంచెం భయపెట్టే కథ అనే విషయం అర్థమైపోతోంది. ఇలాంటి కథను తెరకెక్కించడంలో ఆల్రెడీ తన టాలెంటును 'గీతాంజలి' చిత్రంతో నిరూపించుకున్న రాజ్ కిరణ్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. క్రేజీ మీడియా పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో స్వాతి టైటిల్ రోల్ ని పోషిస్తోంది. ఈ సినిమా విశేషాలను గురించి దర్శక నిర్మాతలు మాట్లాడారు.

ఈ నెల 15న ఆరంభించిన షెడ్యూలు నెలాఖరు వరకూ జరుగుతుందనీ, ప్రస్తుతం క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ఇక రెండు పాటలు మాత్రమే మిగిలి ఉంటాయనీ, వచ్చే నెల మొదటివారంలో వీటిని కుట్రాలం, పొల్లాచ్చి, కొడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నామని అన్నారు. కథ,కథనాలు, స్వాతి నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. త్రిపుర మొదటి నుంచి చివరివరకూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)