ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మెగా' సినిమాల పండుగ!

Tue, Jun 23, 2015
చిరంజీవి
చిరంజీవి
సినిమాలకి దూరంగా వెళ్లిన చిరంజీవి తిరిగి నటించే క్షణాల కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానేవచ్చేసింది .. చిరంజీవి నటించనున్న 150వ సినిమా షూటింగ్ ముహూర్తం ఆయన జన్మదిన వేడుక రోజుగా నిర్ణయించారు. ఇది ఆయన 60వ పుట్టినరోజు కావడం విశేషం.

ఇలా చిరూ పుట్టినరోజు .. ఆయన కొత్త సినిమా ఈ రెండూ సంఖ్యాపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకోవడం అభిమానులకి మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లు ఆగస్టు 15 నుంచి 22 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వారోత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ - ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ థియేటర్లో వారం రోజుల పాటు, చిరంజీవి కెరియర్లో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఆ చిత్రాలుగా మంచుపల్లకి .. ఖైదీ .. ఛాలెంజ్ .. స్వయం కృషి .. శుభలేఖ .. రాక్షసుడు .. ఘరానా మొగుడు .. ఠాగూర్ .. అభిమానులకు పండుగ చేయనున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)