ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహారాణిగా ఆకట్టుకుంటోన్న శ్రీదేవి

Mon, Jun 22, 2015
శ్రీదేవి
శ్రీదేవి
ఒకప్పుడు తెలుగు తెరపై శ్రీదేవి మేడ మెట్లు దిగుతూ కనిపిస్తేనే ఆమెని ప్రేక్షకులు మహారాణిగా చూసేవాళ్లు. అలాంటి శ్రీదేవి చాలాకాలం తరువాత మహారాణిగా దర్శనమిచ్చి అభిమానుల ముచ్చట తీర్చింది. ఆమె అలా మహారాణిగా కనిపించింది 'పులి' టీజర్లో. ఈ సినిమాలో విజయ్ కథానాయకుడిగా, శృతిహాసన్ .. హన్సిక నాయికలుగా నటిస్తున్నారు. ఇక మహారాణి పాత్రలో శ్రీదేవి కనిపిస్తుంది.

ఈ రోజున విడుదల చేసిన ఈ సినిమా టీజర్లో నాయక వర్గంలో విజయ్ .. శత్రువర్గంలో సుదీప్ కనిపిస్తున్నారు. బంగారు కిరీటాన్ని ధరించి మహారాణిగా సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీదేవి .. అక్కడి నుంచి దిగి హుందాగా నడచుకుంటూ వచ్చే తీరు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా అనిపిస్తోంది. భారీతారగణంతో చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, త్వరలో తెలుగు .. తమిళ .. హిందీ ప్రేక్షకుల ముందుకి రానుంది.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)