ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్టార్స్ మధ్య నిలువెత్తు స్నేహం

Mon, Jun 22, 2015
మమ్ముట్టి
మమ్ముట్టి
కష్టాల్లో వున్నప్పుడు .. బాధల్లో వున్నప్పుడు నేను తోడుగా ఉన్నానంటూ పలికే ఆత్మీయ స్వరమే స్నేహం. మంచి మనసు ఎప్పుడూ స్నేహాన్నే కోరుకుంటూ వుంటుంది. ఓదార్పునిస్తూ .. ధైర్యం చెప్పే స్నేహం మనసుకు ఉత్సాహాన్నీ .. ఉత్తేజాన్ని ఇస్తుంది. అలాంటి స్నేహం లభించడం కష్టమే. అందునా ఒకే వృత్తిలో కొనసాగుతున్నప్పుడు .. ఆ వృత్తిలో సంపాదన కోట్లలో వున్నప్పుడు నిజమైన స్నేహం కనిపించడం కష్టమే.

అందుకు తాము భిన్నం అన్నట్టుగా తమిళ చిత్రపరిశ్రమలో కమలహాసన్ .. రజనీకాంత్, మలయాళ చిత్రపరిశ్రమలో మమ్ముట్టి .. మోహన్ లాల్ కనిపిస్తుంటారు. నటనాపరంగా కమల్ ని చూసి తాను నేర్చుకుంది చాలా వుందని ఓ సందర్భంలో రజనీ చెబితే, ఆయన స్టైల్ ని ఇష్టపడేవాళ్లలో తాను ఒకడినని కమల్ మరో సందర్భంలో చెప్పాడు.

ఇక ఒకే భాషకి చెందిన కథానాయకులుగా తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుంటుందే తప్ప, అసూయ ద్వేషాలు ఎప్పుడూ లేవని మోహన్ లాల్ తో తనకి గల స్నేహాన్ని గురించి ప్రస్తావిస్తూ మమ్ముట్టి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాము ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటామనీ, తరచూ కలుసుకుంటూనే ఉంటామని అన్నాడు. తమలో ఎవరి సినిమా విజయవంతమైనా కలిగే ఆనందం .. సంతోషం అదేనని చెప్పుకొచ్చాడు. అందుకే ఆయా చిత్రపరిశ్రమలకి వాళ్లు రెండు కళ్లలా నిలిచారు .. కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)