ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ సినిమాలో ప్రకాష్ రాజ్

Sat, Jun 20, 2015
ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్
కొన్ని పాత్రలు తాను మాత్రమే చేయాలన్నంతగా ప్రభావాన్ని చూపుతున్న నటుడు ప్రకాష్ రాజ్. అందుకే, విలక్షణమైన పాత్ర వుంటే అది ఆయనకే వెళుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే చిత్రానికి కూడా అలాగే ప్రకాష్ రాజ్ ని సంప్రదిస్తున్నారు. రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా కలైపులి థాను తాజాగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో కీలకమైన ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ ని తీసుకుంటున్నట్టు చెన్నయ్ సమాచారం. ఇదిలా ఉంచితే, ఇప్పటికే ఈ విలక్షణ నటుడు కమలహాసన్ నటిస్తున్న 'చీకటి రాజ్యం' చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)