ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మధుబాల మళ్లీ బిజీ అవుతోంది

Fri, Jun 19, 2015
మధుబాల
మధుబాల
చూస్తుంటే నిన్నటితరం నాజూకు నాయిక మధుబాల మళ్లీ బిజీ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. తమిళ చిత్రం 'మహానక్షత్రం'లో ఆమె ఓ కీలకమైన పాత్రను పోషిస్తూ వుండటం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. మధుబాల అనగానే 'రోజా' సినిమా కళ్లముందు కదలాడుతుంది. చిన్ని చిన్ని ఆశ అంటూ ఆమె చేసిన అల్లరి గుర్తుకువస్తుంది. ఆ తరువాత 'అల్లరిప్రియుడు' తో పాటు మరికొన్ని తెలుగు చిత్రాలతోను ఆమె ప్రేక్షకులను అలరించింది.

తెలుగు .. తమిళ .. హిందీ .. చిత్రాల్లో మధుబాల తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. కొంతకాలం పాటు నటనకి దూరంగా వున్న ఆమె, ఇటీవల కాలంలో తన వయసుకు తగిన ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 'అంతకుముందు ఆ తరువాత' .. 'సూర్య vs సూర్య' చిత్రాల్లో కనిపించిన మధుబాల, తమిళ్లో 'మహానక్షత్రం'లో చేస్తోంది. దాంతో మధుబాల మళ్లీ బిజీ అవుతోందనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)