ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయానికి చిరునామా ఏఆర్ రెహ్మాన్

Fri, Jun 19, 2015
ఏఆర్ రెహ్మాన్
ఏఆర్ రెహ్మాన్
జీవితం కొంతమందికే వడ్డించిన విస్తరిలా వుంటుంది. మిగతా వాళ్లు తమకి కావలసినవి ఒక్కొ క్కటిగా ఆ విస్తరిలో వడ్డించుకోవలసిందే. అలా వడ్డించుకోవడానికి ఎన్నో అవస్థలను అనుభవించవలసిందే. సంగీత దర్శకుడిగా .. ఎవరెస్టుకి సమానంగా ఎదిగిన ఏ.ఆర్. రెహ్మాన్ జీవితంలోను ఎన్నో కష్టాలు వున్నాయి.

తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు రెహ్మాన్ పైనే పడ్డాయి. తండ్రి ఉపయోగించే సంగీత సాధనాలు తప్ప ఆ ఇంట్లో మరేమీ లేవు. ఆ సంగీత సాధనాలను అద్దెకి ఇచ్చుకుంటూ .. తానూ ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ ఉండేవాడు. సినిమా సంగీతంపై పట్టు సాధించడానికి ఆయన అనుక్షణం పరితపిస్తూనే ఉండేవాడు. అయితే తాను అనుకున్న మార్గంలో ముందుకి వెళ్లలేని పరిస్థితులు ఎదురైతే కుటుంబాన్ని ఎలా పోషించాలనే ఆందోళన ఆయనని వెంటాడుతూ వుండేదట.

అలాంటి పరిస్థితి ఎదురైతే కారు డ్రైవర్ గా జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుని, ఆ మరుసటి రోజు నుంచే కారు డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అలా ఈ పని నాకు తెలుసు అన్నట్టుగా ఒక పని నేర్చుకుని పెట్టుకుని, తనకి ఇష్టమైన సంగీతాన్ని ఒక పనిగా కాకుండా తపస్సులా భావించి అహర్నిశలు కృషి చేశాడు. తొలి చిత్రమైన 'రోజా'తోనే విజయాన్ని సొంతం చేసుకుని, సంగీతానికే కాదు .. ప్రతిభకు కూడా ఎల్లలు లేవని నిరూపించాడు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)