ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార హర్ట్ అయిందట!

Fri, Jun 19, 2015
నయనతార
నయనతార
నయనతార తన తాజా సినిమాల విషయాల్లోనే కాదు, ప్రేమవ్యవహారాలకి సంబంధించిన విషయాల్లోను వార్తల్లో కనిపిస్తుంటుంది. ముందుగా శింబూతోను .. ఆ తరువాత ప్రభుదేవాతోను ఆమె ప్రేమవ్యవహారాలు వెలుగు చూశాయి. ఇటీవల దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఆమె చనువుగా ఉంటోందనీ, ఇద్దరూ చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారనే వార్తలు షికారు చేశాయి. ప్రస్తుతం అతను తెరకెక్కిస్తోన్న సినిమాలో నయన కథానాయిక.

ఈ షూటింగ్ సమయంలో జరిగిన పరిచయమే ప్రేమగా మారిందనే ప్రచారం జరిగింది. అయితే కాస్తంత తీరిక చేసుకుని ఇదంతా పుకారు మాత్రమేనని నయనతార కొట్టిపారేసింది. కానీ ఆమె విఘ్నేశ్ శివన్ తో చనువుగా దిగిన సెల్ఫీ ఒకటి తాజాగా బయటికి రావడంతో నయన హర్ట్ అయిందట. ఈ కారణంగానే ఆమె ఆ రోజున హాజరు కావలసిన షూటింగుకి కూడా వెళ్లలేదని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)