ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈవీవీ ఎప్పుడూ మరిచిపోలేదు!

Wed, Jun 17, 2015
ఈవీవీ సత్యనారాయణ
ఈవీవీ సత్యనారాయణ
ప్రతిభను కలిగి వుండటం అదృష్టం. ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారు లభించడం దైవానుగ్రహం. అయితే అలా ప్రోత్సాహించిన వాళ్లని కొంతమంది మరిచిపోతుంటారు, మరికొంతమంది మరణించేవరకూ గుర్తుంచుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దర్శకులు ఈవీవీ సత్యనారాయణ ఒకరుగా కనిపిస్తారు.

ఆయన మొదటి సినిమా 'చెవిలో పువ్వు' పెద్దగా ఆడలేదు. అయినా ఆయనలోని దర్శక ప్రతిభను రామానాయుడు గుర్తించి, 'ప్రేమఖైదీ' సినిమాతో అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా షూటింగులో ఒక షాట్ కోసం ఉపయోగించిన 'జీపు'బాగా 'డ్యామేజ్' అయిందట. ఆ విషయాన్ని కాస్త కంగారు పడుతూనే నాయుడిగారికి ఈవీవీ చెప్పారు. 'షాట్ బాగా వచ్చింది కదా .. జీప్ డ్యామేజ్ విషయాన్ని మరిచిపొండి' అని ఆయన అన్నారట.

అంతలా ఆయన అండగా నిలవడం వల్లనే ఆ సినిమా అంత సక్సెస్ అయిందని ఈవీవీ గుర్తుచేసుకునేవారు. ఆ సినిమా సక్సెస్ తనని దర్శకుడిగా నిలబెట్టిందనీ, ఆ తరువాత నిర్మాతగా మారే స్తోమతను ఇచ్చిందని అనేవారు. సందర్భం వచ్చిన ప్రతిసారి రామానాయుడు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని చివరివరకూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూనే వచ్చిన మంచి మనసున్న మనిషి ఈవీవీ సత్యనారాయణ.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)