ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బెంగుళూరులో పవన్ కల్యాణ్

Wed, Jun 17, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ గుబురుగా గెడ్డం పెంచడంపై కొన్ని ఊహాగానాలు బయలుదేరాయి. వాటిని ఆయన ఎంతమాత్రం పట్టించుకోలేదు .. ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గత వారం ఆయన అదే గెడ్డంతో బెంగుళూరులోని ఒక 'జిమ్' లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రాజకీయపరమైన వార్తల్లో పవన్ కల్యాణ్ కనిపించడం లేదు .. ఆయన పేరు వినిపించడం లేదు.

దాంతో 'గబ్బర్ సింగ్ 2' సినిమా షూటింగులో ఆయన పాల్గొంటున్నాడని అనుకుంటూ, ఆ సినిమా విశేషాలను గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ఇంకా గబ్బర్ సింగ్ 2 షూటింగులో పాల్గొనలేదనీ .. ఈ నెల 25న జాయిన్ అవుతాడని అంటున్నారు. దాంతో ఈ సినిమాలో పాత్రకి తగిన విధంగా కనిపించడం కోసమే ఆయన జిమ్ లో కసరత్తు చేస్తున్నాడేమోనని సమాధానపడుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)