ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్రామీణ యువతిగా నయనతార

Wed, Jun 17, 2015
నయనతార
నయనతార
తెలుగులో నయనతార చేసే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక తమిళ్ సినిమాల విషయానికి వస్తే ఆమె డేట్స్ దొరకని పరిస్థితి వుంది. పారితోషికాన్ని భారీగా పెంచినా అదే పరిస్థితి కొనసాగుతూ వుండటం విశేషం. ప్రస్తుతం ఆమె 'తిరుణాల్' చిత్రం షూటింగుతో బిజీబిజీగా వుంది. ఈ సినిమాలో ఆమె ఒక గ్రామీణ యువతిగా కనిపించనుంది. కథానాయకుడు జీవా గ్రామానికి చెందిన ఒక మొరటోడు పాత్రలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో వచ్చే ప్రధానమైన సన్నివేశాలను, 'కుంభకోణం' లో భారీ సెట్ వేసి .. నాయకా నాయికలతో పాటు దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాలను దర్శకుడు రామనాథ్ తెరకెక్కిస్తున్నాడు. రొటీన్ కి భిన్నంగా నయనతార ధరిస్తోన్న గ్రామీణ యువతి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని నిర్మాత సెంథిల్ కుమార్ వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)