ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేష్ తో జోడీ కడుతుందట!

Mon, Jun 15, 2015
శ్రద్ధాకపూర్
శ్రద్ధాకపూర్
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భామల నుంచి, బాలీవుడ్ కుర్రకారు ప్రేక్షకులకు నిద్రలేకుండా చేస్తోన్న కొత్త కథానాయికల వరకూ ఎవరిని పలకరించినా ఒకటే మాట. అదేవిటంటే .. మహేష్ బాబు తో నటించాలని వుంది. ఆయన గురించి విన్నాం .. ఆయన సినిమాలు చూశాం. మంచి అందగాడు .. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని అంటూ వుంటారు. తాజాగా అచ్చు ఇవే మాటలు బాలీవుడ్ కుర్ర హీరోయిన్ 'శ్రద్ధాకపూర్' నోటి నుంచి కూడా వచ్చాయి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యూత్ ని ఒక ఊపు ఊపేయడమే పనిగా పెట్టుకుంది. ఈ సుందరి నటించిన తాజా చిత్రం 'ఏబీసీడీ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా శ్రద్ధాకపూర్ కథానాయకుల గురించి మాట్లాడుతూ, తనకి హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమనీ, టాలీవుడ్లో మహేష్ మంచి అందగాడనీ, ఆయన జోడీ కట్టే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దని తన స్నేహితులు మరీ మరీ చెప్పారని అంది. అలా అమ్మడు విసిరిన గాలం ఫలితాన్ని పట్టుకొస్తుందో లేదో చూడాలి.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)