ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఈగ' సుదీప్ సరసన షామిలి

Sun, Jun 14, 2015
షామిలి
షామిలి
కథానాయికగా షామిలి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. దశాబ్దాల క్రితం బాలనటిగా పలు సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న షామిలి, కొన్నాళ్ల క్రితం సిద్ధార్థ్ తో కల్సి 'ఓయ్' అనే సినిమాలో కథానాయికగా పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమా ఫ్లాపవడంతో, తను అమెరికా వెళ్లిపోయి సినిమాలకు సంబంధించిన కోర్సు చేసి వచ్చింది. ఇప్పుడు కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో 'ఈగ' సుదీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో షామిలి హీరోయిన్ గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. కాగా, షామిలి ప్రముఖ తమిళ నటుడు అజిత్ కు మరదలన్న సంగతి మనకు తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)