ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నానికి అరుదైన గౌరవం

Sat, Jun 13, 2015
మణిరత్నం
మణిరత్నం
మనసులు కలవడంలోని మధురమైన అనుభూతి .. కులమత విద్వేషాలు మానుకోవడం వలన కలిగే ఆనందం .. దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటంలోని సంతోషం .. కరుడుగట్టినట్టు కనిపిస్తోన్న మనుషుల్లోను దాగిన మానవత్వం .. ఇవన్నీ మణిరత్నం చిత్రాల్లో కనిపిస్తుంటాయి. ప్రేమ .. సోదరభావమే ప్రపంచాన్ని ప్రశాంతంగా ముందుకు నడిపిస్తుందనే కథావస్తువే మణిరత్నానికి అరుదైన గౌరవాలు తెచ్చిపెట్టింది. ఆయనలోని ఆ ప్రత్యేకతే ఆయన చిత్రాలకి 'న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్' లో స్థానం లభించేలా చేసింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినీరంగ ప్రముఖుల జీవితాలను డాక్యుమెంటరీ రూపంలో ఇక్కడ ప్రదర్శించి .. వారిని సత్కరిస్తారు. తాజాగా ఈ ఆహ్వానం మణిరత్నానికి వచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన రోజా .. బాంబే .. దిల్ సే చిత్రాలను ఈ మ్యూజియంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకూ ప్రదర్శిస్తారు. ఆ తరువాత చర్చావేదికను నిర్వహించి మణిరత్నాన్ని సత్కరిస్తారు. మణిరత్నానికి లభించిన ఈ గౌరవం భారతీయ సినిమాకు లభించినదిగా భావించవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)