ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దూకుడు పెంచిన అలియాభట్

Sat, Jun 13, 2015
ఆలియాభట్
ఆలియాభట్
అలియాభట్ .. కుర్రకారు కలలరాణి .. వాళ్ల ఊహలకి ఊపిరి. దారితప్పి భూలోకానికి వచ్చిన దేవకన్యలా యూత్ ఆమెని ఆరాధిస్తూ వుంటుంది. ఇక ఆమె ఫ్యాషన్ ని ఫాలో అయిపోవడానికి అమ్మాయిలు ఆరాటపడుతుంటారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఈ అమ్మాయి మాత్రం, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలను చుట్టబెడుతోంది. ఆల్రెడీ మొదలైన రెండు సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే, రేపో ఎల్లుండో సెట్స్ పైకి రానున్న మరో రెండు సినిమాల షూటింగ్స్ కి సిద్ధమైపోతోంది.

ఒక సినిమా చేసేసి కొంతకాలం విదేశాలకి వెళ్లి వస్తేనే గానీ మళ్లీ పనిచేయలేం అనుకునే ఈ రోజుల్లో అమ్మడు ఇలా నాలుగు సినిమాలను ప్లాన్ చేసుకోవడం అక్కడి కథానాయికలలో కొందరికి కంగారు పుట్టిస్తోంది. అవకాశాలను తనచుట్టూ తిప్పుకుంటోంది .. ఎగ్గొట్టకుండా షూటింగులకి వెళుతూ మంచిపేరూ కొట్టేసింది. దాంతో ఈ సుకుమారి ఇంత స్పీడుతో వున్నప్పుడు, అవకాశాలను కాపాడుకుంటూ ఉండటమే మంచిదనే ఉద్దేశంలో కొంతమంది సరదాగా చేసే విదేశీ ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్నారట.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)