ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కినేని తీసుకున్న నిర్ణయం!

Fri, Jun 12, 2015
అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు
తెలుగు తెరపై రొమాంటిక్ చిత్రాలను పరుగులు తీయిస్తూ .. ఉత్సాహ భరితమైన పాటలను ఉరకలు వేయించిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. పాత్రకి జీవం పోసి దానిని ప్రేక్షకుల హృదయంలో ప్రతిష్ఠించడం ఆయన ప్రత్యేకత. నట సామ్రాట్టుగా .. తిరుగులేని కథానాయకుడిగా సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఆయన కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే, ఇంకా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం వుందని అనిపిస్తుంది. ఆ విషయాన్ని గురించి గతంలో ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు.

కథానాయకుడిగా కెరియర్ ఆరంభమయ్యాక తీరికలేనంతగా అక్కినేని బిజీ అయ్యారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆయన వరసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చారు. దాంతో ఆయన కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువగా వుండేది. కావలసినంత పని .. అందుకు తగిన సంపాదన వున్నా, కుటుంబంతో గడపలేకపోతున్నాననే అసంతృప్తి ఉండేదట. దాంతో ఇక ప్రతి ఏడాది రెండు నెలల పాటు తన కుటుంబం కోసం కేటాయించాలని నిర్ణయించుకుని దానిని ఆచరణలో పెట్టారు. అలా తనకి తానుగా సినిమాల సంఖ్యను తగ్గించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)