ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మనోజ్ సినిమా మొదలైంది

Mon, Jun 08, 2015
మనోజ్
మనోజ్
తెలుగు తెరపై దూకుడు పాత్రల్లో దూసుకుపోయే యంగ్ హీరో ఎవరయ్యా అంటే, మనోజ్ అనే పేరు ఠకీమని వినిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ .. కామెడీలోను .. డాన్సుల్లోను మనోజ్ ని పట్టుకోవడం కాస్తంత కష్టమైన పనే. అలాంటి మనోజ్ కథానాయకుడిగా, దశరథ్ ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. వాళ్ల కాంబినేషన్లో రూపొందుతోన్న ఆ సినిమా షూటింగ్ హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది. 'సూర్య vs సూర్య' వంటి హిట్ చిత్రాన్ని అందించిన శివకుమార్, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

చురుకైన కథానాయికగా మార్కులు కొట్టేసిన రెజీనా, ఈ సినిమాలో మనోజ్ జోడీగా అలరించనుంది. ప్రకాశ్ రాజ్ పోషించే పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. కుటుంబ నేపథ్యంలోని అనుబంధాలను అందంగా ఆవిష్కరించే దర్శకుడిగా దశరథ్ కి మంచి పేరుంది. అల్లరి కుర్రాడిగా అదరగొట్టే మనోజ్ ని ఆయన ఎలా చూపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)