ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గబ్బర్ సింగ్ పేరు 'సర్దార్'గా మారనుందా?

Fri, Jun 05, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
శరత్ మరార్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్ 2' చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మొన్ననే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూలును పూర్తిచేశారు. రెండవ షెడ్యూలులో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక కొత్త విశేషం ఏమిటంటే, ఈ సినిమా టైటిల్ ని మారుస్తున్నారనే వార్త షికారు చేస్తుండటం.

మొదటినుంచి కూడా అభిమానులు ఈ సినిమాను 'గబ్బర్ సింగ్ 2' గానే పిలుచుకుంటూ వచ్చారు. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించిన సమాచారం అభిమానుల ముందుకి ఈ పేరుతోనే వెళ్లింది. అయితే దర్శక నిర్మాతలు ఈ సినిమాకి 'సర్దార్' అనే పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్దార్ అనే టైటిల్ పవర్ ఫుల్ గా ఉంటుందనీ, పవన్ పవర్ కి అది దగ్గరగా ఉంటుందని భావించి ఈ పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేవరకూ ఆగాల్సిందే.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)