ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వచ్చే నెలలోనే కమల్ 'పాపనాశం'

Wed, Jun 03, 2015
కమలహాసన్
కమలహాసన్
నిన్నమొన్నటి వరకూ భారీ బడ్జెట్ చిత్రల కోసం ఎక్కువ కాలాన్ని వెచ్చించిన కమల్, ఇప్పుడు కథాబలం కలిగిన చిన్న చిత్రాలను చకచకా చేస్తూ వెళుతున్నాడు. అలాంటి ఆయన చిత్రాలలో 'పాపనాశం' ఒకటిగా చెప్పుకోవచ్చు. మలయాళ చిత్రం 'దృశ్యం' చిత్రానికి ఇది రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ తోను .. తెలుగులో వెంకటేష్ తోను చేసిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఇక మరో వైపున బాలీవుడ్ లోను అజయ్ దేవగణ్ కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితవుతోంది.

ఈ నేపథ్యంలో తమిళ్లో కమలహాసన్ కథానాయకుడిగా రూపొందిన 'పాపనాశం' చిత్రాన్ని జూలై 17 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేబుల్ ఆపరేటర్ గా కమల్ నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన భార్యగా గౌతమి నటిస్తుండటం విశేషం. ఇలాంటి పాత్రలను పండించడంలో కమల్ సిద్ధహస్తుడు కాబట్టి, ఈ సినిమా తమిళ్లోను ఘనవిజయాన్ని సాధించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)