ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సిటీలో చరణ్ సందడి మొదలైంది

Wed, Jun 03, 2015
రాంచరణ్
రాంచరణ్
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న సినిమా షూటింగ్ సందడి ఈ రోజున హైదరాబాదులో మొదలైంది. తాజాగా ఇక్కడ మొదలైన షెడ్యూల్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా, గత నెల 21 నుంచి 30 వరకూ యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంది. అందమైన లోకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటలు అద్భుతంగా అనిపిస్తూ అలరిస్తాయి. ఇక ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదులో చిత్రీకరించడం జరుగుతుందని అన్నాడు.

రాంచరణ్ తో పాటు కృతికర్బందా .. తనికెళ్ల భరణి .. రావు రమేష్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నారని చెప్పాడు. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని అన్నాడు. రాంచరణ్ యాక్షన్ .. రకుల్ గ్లామర్ .. శ్రీను వైట్ల టేకింగ్ .. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)