ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళ్ లో తాప్సీ బిజీబిజీ

Tue, Jun 02, 2015
తాప్సీ
తాప్సీ
కొంతమంది కథానాయికలు ఇలా చిత్రపరిశ్రమకి పరిచయమై అలా అగ్రస్థానం వైపు దూసుకుపోతుంటారు. మరి కొంతమందికి అందం .. ప్రతిభా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకుండా పోతుంటాయి. అలాంటి కథానాయికలలో తాప్సీ పేరు కూడా వినిపిస్తూ వుంటుంది. తనకి వరుసగా అవకాశాలు రాకపోవడం వలన ఆ మధ్య కాస్తంత అసహనానికి లోనైన తాప్సీకి ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయి. అందుకు కారణం 'కాంచన2' సాధించిన విజయమేనని ఆమె కూడా అంగీకరిస్తోంది.

ఈ సినిమా తరువాత శింబూ, జయ్ సినిమాలలో ఆమెకి అవకాశాలు దక్కాయి. తాజాగా విష్ణు విశాల్ తోను ఆడిపాడనుంది. విజయ్ .. అజిత్ వంటి అగ్రకథానాయకుల చిత్రాలకి దర్శకుడిగా వ్యవహరించిన 'ఎలిళ్' ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. తాప్సీ చేస్తోన్న ఈ మూడు సినిమాలు విభిన్నమైనవే. ఇవి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకుంటే, మరికొంతకాలం తాప్సీ వెనుదిరిగి చూసుకోవలసిన పనిలేదనే చెప్పుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)