ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మనోజ్ దూకుడు మొదలైంది

Mon, Jun 01, 2015
పెళ్లిసందడి పూర్తి కావడంతో తిరిగి తన అభిమానులను పలకరించడం కోసం మనోజ్ మళ్లీ సిద్ధమవుతున్నాడు. జి.ఈశ్వర్ దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం మొదలు కానుంది. జ్యోత్స్న ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు- ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా మొదలైంది. మనోజ్ క్లాప్ ఇవ్వగా రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహం పై ముహూర్తపు షాట్ ని చిత్రీకరించారు.

ఈ కథ తనకి ఎంతగానో నచ్చిందనీ, అందువల్లనే వెంటనే అంగీకరించానని మనోజ్ చెప్పాడు. ఇక దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాలో మనోజ్ జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపిస్తారని చెప్పారు. రొమాంటిక్ లవ్ .. కామెడీ ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తాయని అన్నారు. జూలై రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగు జరుగుతుందనీ, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడి చేస్తామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)