ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

100 కోట్ల క్లబ్బులో మరో హీరో

Mon, Jun 01, 2015
మాధవన్
మాధవన్
'సఖి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయిన తమిళ నటుడు మాధవన్ కొంత గ్యాప్ తర్వాత ఇటీవల హిందీలో చేసిన 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం అతనికి మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు, 100 కోట్ల క్లబ్బులో చేరిన హీరోగా ఆ సినిమా అతనికి పేరు తెచ్చింది. ఈ నేపథ్యంలో మాధవన్ చెబుతూ, "అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. అప్పుడే ఇక్కడికి వచ్చి పదిహేనేళ్లు అయిపోయింది. నేను ఏ తరహా సినిమా చేసినా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. అంతేకాదు, ఆయా సినిమాల్లో నా పాత్రల పేర్లను కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పుడు వంద కోట్ల క్లబ్బులో కూడా చేరాను. ఇంతకు మించి ఇంకేం కావాలి?" అన్నాడు. అన్నట్టు, మాధవన్ ఈ రోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఇప్పుడతని వయసు 45 ఏళ్లు!
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)