ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విహారయాత్రకి ఒక్కతే వెళ్లిందా?

Fri, May 29, 2015
సోనాక్షీ సిన్హా
సోనాక్షీ సిన్హా
చిత్రపరిశ్రమలో క్రేజ్ .. ఇమేజ్ వున్న నటీనటుల ప్రేమ వ్యవహారాలు ఇట్టే బయటికి వచ్చేస్తుంటాయి. వాటిలో కొన్ని పుకార్లయితే, కొన్ని నిజాలు ఉంటూ వుంటాయి. సహజంగానే నాయకా నాయికల ప్రేమ వ్యవహారాలు .. ఎవరు ఎవరితో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారనే వార్తల పట్ల ఆసక్తిని చూపే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. వాళ్ల చర్చల్లో ఇలాంటి విషయాలే ప్రాధాన్యతను సంతరించుకున్నవిగా కనిపిస్తుంటాయి. అలాంటి చర్చల్లో ప్రస్తుతం 'సోనాక్షీ సిన్హా' పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం ఈ సుందరి మాల్దీవులకి వెళ్లింది. రెండు రోజుల పాటు విరామం దొరకడంతో సరదాగా అలా అలా షికారు చేసిందట. దాంతో ఆమె ఎవరినో వెంట తీసుకెళ్లిందనే ప్రచారం భారీస్థాయిలో జరిగింది. ఈ పుకారుని సోనాక్షీ చాలా తేలికా కొట్టిపారేసింది .. విహారయాత్రకి తాను ఒక్కదానిని మాత్రమే వెళ్లాననీ, అనవసరంగా ఆరాలు తీయడానికి ప్రయత్నించి సమయాన్ని వృథా చేసుకోవద్దని చెబుతోంది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)