ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విదేశాల్లో అందగత్తె విహారం

Thu, May 28, 2015
శ్రద్ధాదాస్
శ్రద్ధాదాస్
తెలుగు తెరపై విరిసిన తెల్లకలువలా కనిపించే శ్రద్ధాదాస్, యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. కొత్త కథానాయికల జోరు పెరుగుతున్నా తాపీగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతోంది. కవ్వించే పాత్రల్లోనే కాదు .. కసి తీర్చుకునే పాత్రలకి కూడా అమ్మడు బాగా సూటవుతుంది. తాజాగా ఈ సుందరి అలాంటి పాత్రనే పోషిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా వ్యవహరిస్తోన్న 'గుంటూర్ టాకీస్' చిత్రంలో శ్రద్ధ రివాల్వర్ రాణి పాత్రలో కనిపించనుంది.

హాలీవుడ్ నాయిక లక్షణాలు పుష్కలంగా వుండే శ్రద్ధ, ఈ సినిమాలో యాక్షన్ దృశ్యాలతో అదరహో అనిపించనుంది. అనంతపురం జిల్లా హిందూపురం షెడ్యూల్ ముగిసిన తరువాత, ఈ సినిమా యూనిట్ పోలాండ్ వెళ్లింది. ప్రస్తుతం అక్కడి 'క్రాకో' నగరంలో పాటలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో శ్రద్ధ ఆ నగరవీధుల్లో షికారు చేస్తూ .. ఆ అనుభూతిని అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)