ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే బాటలో మరో హాస్యనటుడు

Tue, May 26, 2015
శ్రీనివాసరెడ్డి
శ్రీనివాసరెడ్డి
వెండితెరపై హాస్యనటులుగా రాణించినవాళ్లు చాలామంది ఆ తరువాత కథానాయకులుగా వెలుగొందారు. అందువలన హాస్యనటులుగా కొనసాగుతోన్న వాళ్లు కథానాయకుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి కొంత కాలంగా ఇదే పనిలో వున్నాడు. చాలా చిన్నపాత్రల నుంచి తన కెరియర్ ని ఆరంభించాడు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అంటే వెంటనే ప్రేక్షకులకి గుర్తుకువచ్చే స్థాయికి చేరుకున్నాడు.

ఈమధ్య కాలంలో వచ్చిన 'గీతాంజలి' సినిమా అంతా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. అందువలన కథాబలాన్ని తాను మోయగలననే ధైర్యం ఆయనకి వచ్చిందట. కథానాయకుడిగా కనిపించడానికి ఆయన చేస్తోన్న కసరత్తు ఫలించింది. అన్నివిధాలా ఆయనకి తగిన కథ తయారైందని అంటున్నారు. త్వరలోనే ఆయన హీరోగా ఒక సినిమా ఆరంభమవుతుందని సమాచారం. ఆ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)