ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కినేని అంటే అంతే మరి!

Tue, May 26, 2015
అక్కినేని నాగేశ్వర రావు
అక్కినేని నాగేశ్వర రావు
అక్కినేని ఓ నవరస నట గ్రంధమని చెప్పొచ్చు. జీవితంలో ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా చేసుకుని అంచలంచెలుగా ఎదిగిన మహానటుడాయన. ఎలాంటి పరిస్థితుల్లోను తన వలన నిర్మాతకి నష్టం కలగకుండా ఆయన చూసుకుంటూ ఉండేవాడు. అనుకోని కారణాల వలన నటీనటుల డేట్స్ విషయంలో మార్పులు జరిగి, నిర్మాత ఇబ్బంది పడవలసి వచ్చినప్పుడు అందుకు అనుకూలంగా ఆయన తన డేట్స్ సర్దుబాటు చేసేవాడు. ఇలా అక్కినేని నిర్మాతల కథానాయకుడు అనిపించుకున్నాడు.

ఇక కాల్షీటు ఖరారు చేసి, షూటింగుకి వెళ్లిన తరువాత షాట్ రెడీ అంటూ ఎంతసేపటికీ పిలవకపోయినా ఆయన అసహనాన్ని వ్యక్తం చేసేవాడు కాదు. ఎంతో ఓపికతో ఆయన అలా కూర్చునే ఉండేవాడు. ఇచ్చిన కాల్షీటు ప్రకారం తాను వచ్చాను .. ఆ సమయంలో తనకి సంబంధించిన సన్నివేశం తీయకపోతే అందుకు వాళ్లే బాధ్యులుగా ఆయన భావించేవాడే తప్ప ఎవరినీ ఏమీ అనేవారు కాదు. ఇక సెట్లోకి అడుగుపెట్టిన తరువాత అది నిర్మాత సమయమని ఆయన చెప్పేవాడు. అందువలన ఆ సమయాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వృథా చేయకూడదని ఆయన విశ్వసించేవాడు. అందుకే అక్కినేని నటనలోనే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను ఎవరెస్టు శిఖరంలా కనిపిస్తూ వుంటాడు. మరెందరికో మార్గదర్శిగా అనిపిస్తూ వుంటాడు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)