ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజా పాటల పాట్లు

Tue, May 26, 2015
ఇళయరాజా
ఇళయరాజా
తేనెకన్నా తీయనైనది .. మంచుకన్నా చల్లనైనది .. మల్లెకన్నా పరిమళభరితమైనది ఏది అంటే ఇళయరాజా పాట అని టక్కున చెప్పేస్తారు. మనసుకి ఊరట కలిగించేదిగా .. ఊహా లోకంలోకి తీసుకువెళ్లేదిగా ఇళయరాజా పాటలు ఉంటాయి. పాటని ఒక తపస్సులా చేసే ఇళయరాజా దాని ఫలితాన్ని మాత్రం పూర్తిగా పొందలేకపోతున్నాడు. అలవోకగా ఆయన అందించిన పాటలను కాపాడుకోవడానికి నానాకష్టాలు పడవలసి వస్తోంది. రేడియోలు .. టీవీలు .. కొన్ని రికార్డింగ్ సంస్థలు ఆయన అనుమతి లేకుండానే ఆ పాటలను వాడేసుకుంటున్నాయి.

దాంతో ఆ పాటలు విన్నవారికి ఆనందం .. వినిపించినవారికి ఆదాయం లభిస్తుంది గానీ, ఇళయరాజాకి మాత్రం అన్యాయం జరుగుతోంది. దాంతో ఆయన మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించగా, అనుమతి లేకుండా ఎవరూ ఆయన పాటలను వినియోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇళయరాజా చెన్నై పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించడమే కాకుండా, తమిళనాడులో జిల్లాలవారీగా ఎస్ఐలందరికీ లేఖలు కూడా రాసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందనేది వేచి చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)