ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోగా శ్రీకాంత్ తనయుడు

Sat, May 23, 2015
శ్రీకాంత్
శ్రీకాంత్
హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమనేది అన్ని చిత్రపరిశ్రమలలోను కనిపిస్తూనే వుంటుంది. ఇప్పుడదే బాటలో అడుగుపెట్టడానికి హీరో శ్రీకాంత్ తనయుడు 'రోషన్' రెడీగా వున్నాడు. శ్రీకాంత్ .. ఊహ పోలికలు రోషన్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 'రుద్రమదేవి' సినిమాలో రోషన్ తన వయసుకి తగిన పాత్రను పోషించాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తరువాత ఇక రోషన్ కనిపించేది హీరోగానే. అయితే ఈ కుర్రాడు హీరోగా తొలిచిత్రాన్ని నిర్మించేది అన్నపూర్ణ స్టూడియోస్ కావడం విశేషం.

ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ బ్యానర్లో మొదటి సినిమాను చేసే అవకాశం రావడం నిజంగా రోషన్ అదృష్టమే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం వుంది. సినిమా టైటిల్ గా 'నిర్మలా కాన్వెంట్' ను ఖరారు చేయవచ్చని మాత్రం తెలుస్తోంది. రోషన్ తన తండ్రిలాగే కష్టపడి పైకి రావాలనీ, తండ్రిని మించిన తనయుడు కావాలని ఆశిద్దాం.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)