ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరో కొడుకు ఇలా ఎంట్రీ ఇచ్చాడు

Fri, May 22, 2015
నందిని - సుధీర్ బాబు
నందిని - సుధీర్ బాబు
నటీనటులు తమ పిల్లలను తెరకి పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. తమ ముచ్చట తీర్చుకోవడం ఒక కారణమైతే, ఆ సినిమాకి అది ఒక అదనపు ఆకర్షణగా భావించడం రెండవ కారణం. తాజాగా కథానాయకుడు సుధీర్ బాబు, తన కొడుకు 'చరిత్ మానస్'ను కూడా తెలుగు తెరకి పరిచయం చేశాడు. ఆయన నటించిన 'మోసగాళ్లకి మోసగాడు' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. చరిత్ మానస్ ఈ సినిమాలో నటించాడనే విషయాన్ని కూడా సుధీర్ బాబు ఈ రోజునే బయటికి చెప్పాడు.

దాంతో సహజంగానే ఇది ఈ సినిమాపై ఆసక్తి కలగడానికి కారణమైంది. గతంలో కృష్ణగారి సినిమాల్లో ఆయనతో కలిసి బాల మహేష్ నటించాడు. ఇటీవల కాలంలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ సందడి చేశాడు. అదే విధంగా ఈ సినిమాలో సుధీర్ బాబు తో కలిసి ఆయన కొడుకు చరిత్ మానస్ నటించాడు. సంచలనం సృష్టించిన తాత సినిమా టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో మనవడు నటించడం నిజంగా విశేషమే కదా!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)