ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అగ్రస్థానానికి చేరడం అంత తేలికా?

Wed, May 20, 2015
అమితాబ్
అమితాబ్
జీవితంలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలని చాలామందికి వుంటుంది. అయితే ఈ విషయంలో చూపించే శ్రద్ధ ... పట్టుదల .. అంకితభావాలే ఆ కోరికను నెరవేరేలా చేస్తాయి. పైకొచ్చిన వాళ్లు ఎక్కితిరిగే ఖరీదైన కార్లను కాదు, వాళ్లు అక్కడి వరకూ రాళ్ల దారిలో నడిచొచ్చారనే విషయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమపై తమకి గల నమ్మకంతోనే వాళ్లు ఆ స్థాయికి చేరుకున్నారనే విషయాన్ని మననం చేసుకుంటూ ముందుకుసాగాలి.

అమితాబచ్చన్ దారిన వెళుతూ వుంటే పిలిచి బాలీవుడ్ కథానాయకుడిగా ఎవరూ ఆయనకి పట్టం కట్టలేదు. వేషాల కోసం తిరుగుతున్న దశలో 'అసలు నువ్ సినిమాలకి పనికి రావ'ని తేల్చేసిన వాళ్లు వున్నారు. తొలినాళ్లలో .. తమ కొత్త సినిమాలో కథానాయకుడు ఇతనేనంటూ అక్కినేనిని ఒక నిర్మాత భార్యకి పరిచయం చేస్తే, ఆమె భర్తని కాస్త దూరం తీసుకెళ్లి 'ఇతను హీరో ఏంటండీ ..' అంటూ సాగదీసిందట. తొలి రోజుల్లో .. కథానాయకుడికి ఉండవలసిన లక్షణాలు శోభన్ బాబుకి లేవంటూ సెట్లోనే హేళనగా మాట్లాడినవాళ్లు లేకపోలేదు.

ఘంటసాల గొంతు మైకులో పాడటానికి పనికిరాదని ఒక ఆడియో సంస్థవారు నిర్మొహమాటంగా చెప్పారు. ఈ అవమానాలు .. నిష్టూరాలు .. హేళనలు వాళ్ల ప్రతిభను ఆపలేకపోయాయి. అందుకు కారణం వాళ్లపై వాళ్లకి గల నమ్మకం. విజయం అంతు చూడకుండా వెనుదిరగకూడదన్న పట్టుదల. సంకల్పం ఉండాలేగానీ సాధ్యం కానిది లేదనే విశ్వాసం. ఇవే వాళ్లని అగ్రస్థానానికి చేర్చాయి .. లక్షలాదిమంది అభిమానులను సంపాదించి పెట్టాయి. అందుకే వాళ్లని ఆదర్శంగా చెప్పుకోవచ్చు ... వాళ్ల ఆరాధకులమని చెప్పుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)