ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ సినిమాలో నదియా

Wed, May 20, 2015
నదియా
నదియా
ఒకప్పుడు తన గ్లామర్ తో తమిళ ప్రేక్షకులను కట్టిపడేసిన నదియా, ఆ తరువాత తన వయసుకి తగిన పాత్రలను పోషిస్తూ వస్తోంది. గతంలో ఆమె కథానాయికగా చేసిన తెలుగు సినిమాలు ఈ తరం ప్రేక్షకులకి తెలియక పోయినా, ఈ మధ్య కాలంలో వచ్చిన 'అత్తారింటికి దారేది', 'దృశ్యం' వంటి సినిమాలు ఆమెని యూత్ కి పరిచయం చేశాయి. అహంభావం .. హుందాతనం కలిగిన అక్కా .. అత్తా .. అమ్మ పాత్రలకి ఆమె చాలా బాగా నప్పుతుందని అంతా అనుకున్నారు. ఈ తరహా పాత్రలతో ఆల్రెడీ ఆమె తమిళ్లో బిజీగానే వుంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం, శ్రీను వైట్ల .. చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం నదియాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చరణ్ కి ఆమె అత్తగా నటించనుందా .. అమ్మగా నటించనుందా అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. సాధ్యమైనంత వరకూ కథానాయకుడికి తల్లిపాత్ర కావొచ్చనే అంటున్నారు. నదియా పోషించే పాత్ర ఏదైనా అది ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పడంలో ఎలాటి సందేహం లేదు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)