ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో డాన్స్ కి రకుల్ రెడీ!

Tue, May 19, 2015
చరణ్
చరణ్
చిరుత లాంటి అబ్బాయి ఎదురుపడితే .. ఫ్లవర్ బొకేలాంటి అమ్మాయి మనసు పారేసుకోకుండా ఉంటుందా? కలువ కళ్లతో ఆ పిల్ల చూపుల రాయబారాలు పంపుతుంటే, అబ్బాయిగారు కాళిదాసు శిష్యుడుగా మారిపోకుండా ఉంటాడా? ఇదిగో ఇలాంటి సందర్భంలోనే భావం .. భాష రెక్కలు తొడుక్కుని పాటగా పరిమళిస్తూ వుంటుంది. అలాంటి పాటలకి .. అందమైన స్టెప్పులకి ఇప్పుడు యూరప్ వేదికగా మారబోతోంది. ఎందుకంటే ఆ అబ్బాయి రామ్ చరణ్ .. ఆ అమ్మాయి రకుల్ కాబట్టి, ఆ ఇద్దరూ ఈ సినిమాలో నాయకా నాయికలు కాబట్టి.

దానయ్య నిర్మాణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఒక సినిమాలో ఈ ఇద్దరిపై పాటల చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి 30 వరకూ వీళ్ల ఇద్దరిపై పాటలను చిత్రీకరించనున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. యూరప్ అందాలను ఆవిష్కరించే ఈ పాటలు ప్రేక్షకులకి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. ఆ తరువాత జూన్ 3 నుంచి హైదరాబాదులో షూటింగ్ కొనసాగుతుందనీ, అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తామని చెప్పారు. లవ్ .. సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ మేళవింపుగా తీర్చిదిద్దిన ఈ సినిమా చరణ్ అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందని అన్నారు. అయితే టైటిల్ విషయాన్ని ప్రస్తావించకపోవడం .. అభిమానులని మరోసారి ఆలోచనలో పడేసింది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)