ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకి జోడీ లేదా?

Tue, May 19, 2015
రజనీకాంత్
రజనీకాంత్
ఒక వైపున రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ 'రోబో 2' ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈలోగా రంజిత్ దర్శకత్వంలో సినిమాను పూర్తిచేసేందుకు రజనీ సిద్ధమవుతున్నాడు. రజనీని మెప్పించాడంటే రంజిత్ సామాన్యుడు కాదు .. అంతగొప్ప కథ ఏం చెప్పాడబ్బా! అని అంతా అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకి షాక్ ఇస్తూ ఈ సినిమాలో కథానాయిక ఉండదనే వార్త షికారు చేస్తోంది. కథాపరంగా ఈ సినిమాలో రజనీ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఆయన వయసుకి తగిన పాత్ర కావడం వలన, కథానాయిక ప్రసక్తి లేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియక, ప్రేక్షకులు మాత్రం సతమతమైపోతున్నారు. ఈ నేపథ్యంలో కథ లేకపోయినా ఫరవాలేదుగానీ, కథానాయిక లేకపోతే ఎట్లా? అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కథానాయిక లేకపోతే థియేటర్లో ప్రేక్షకులు అంతసేపు కూర్చోలేరు. కథానాయకుడికి కూడా పాటలు .. ఫైట్లు వంటి పన్లేం ఉండవ్. కాబట్టి కథానాయిక లేకపోవడమనే మాటే ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ గా ఎవరో ఒకరి ఎంపిక జరిగితే గాని ఈ సందేహాలకి తెరపడదు. ఒక వేళ అలాంటిదేం జరగకపోతే మాత్రం ఇది నిజంగా ఒక ప్రయోగమే.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)