ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందులో నిజం లేదంటోన్న హన్సిక

Sat, May 16, 2015
హన్సిక
హన్సిక
అందాల హన్సికకి తెలుగులోను .. తమిళ్లోను మంచి ఫాలోయింగ్ వుంది. ఇక సూర్యకి కూడా ఇక్కడా అక్కడా మంచి మార్కెట్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సింగం 3' సినిమా రానుందనే వార్తలు ఇటీవల జోరందుకున్నాయి. ఈ వార్తల పట్ల హన్సిక స్పందిస్తూ ఈ సినిమాలో తాను కథానాయికనంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పింది. గతంలో తమిళ్లో వచ్చిన సింగం .. సింగం 2 సినిమాలు అక్కడ అఖండవిజయాలను సాధించాయి. తెలుగులోను విడుదలై అనూహ్యమైన స్థాయిలో ఆదరణ పొందాయి.

సింగంలో అనుష్క కథానాయికగా అలరించగా, ఆ తరువాత వచ్చిన సింగం 2లో అనుష్కతో పాటుగా హన్సిక కూడా కనువిందు చేసింది. ఇక ఈ సిరీస్ లో రానున్న 'సింగం 3' సినిమాకి కథానాయికలుగా శృతిహాసన్ .. హన్సికలను ఎంపిక చేయడం జరిగిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హన్సిక తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ తనని ఎవరూ సంప్రదించలేదనీ, తాను ఈ సినిమాలో నటిస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)