ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జ్యోతికకి కోపం తెప్పించే సూర్య

Sat, May 16, 2015
జ్యోతిక
జ్యోతిక
వెండితెరపై మెరుస్తూ .. అనేకమంది అభిమానులను సంపాదించుకున్న నాయకా నాయికలు చాలామంది వివాహం చేసుకున్నారు. అలా వివాహం చేసుకుని అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తోన్న నాయకా నాయికల్లో సూర్య .. జ్యోతిక ముందువరుసలో కనిపిస్తుంటారు. అటు చిత్రపరిశ్రమకి సంబంధించినవాళ్లు .. ఇటు సన్నిహితులు వీళ్ల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పుకుంటూనే వుంటారు. అయితే సూర్య అప్పుడప్పుడు తనకి కోపాన్ని తెప్పిస్తూ ఉంటాడనే విషయాన్ని సరదాగా జ్యోతిక చెప్పుకొచ్చింది. తాను నటించిన '36 వయధినిలే' సినిమాను గురించి మాట్లాడుతూ ఆమె ఈ విషయం చెప్పింది.

అంతగా ఆమెకి కోపం కలిగించే పనులు అయ్యగారు ఏం చేస్తాడా? అని ఆలోచించే సమయం ఇవ్వకుండా ఆమే చెప్పేసింది. చాలా తక్కువ సమయం మాత్రమే సూర్య ఇంటిపట్టున ఉంటాడట. ఆ సమయమంతా ఆయన స్నేహితులతో వరుసబెట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ... ఫోన్లో మాట్లాడుతూనే గుమ్మంలోకి అడుగుపెడుతుండటం చూసినప్పుడు మాత్రం తనకి కోపం వస్తుందని అంది. అసలు ఈ కాలంలో ఫోన్ ఎవరిని మనశ్శాంతిగా వుండనిస్తుందనీ, స్టార్ హీరోకి ఆ మాత్రం ఫోన్లు రాకుండా ఎలావుంటాయి .. సర్దుకుపోవాలంతే అనేది అభిమానుల మాట.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)