ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదృష్టమంటే అదేనంటోన్న చరణ్

Thu, May 14, 2015
రాంచరణ్
రాంచరణ్
మెగా అభిమానులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ చిరంజీవి 150వ సినిమా ఈ ఏడాదిలో ఉంటుందనే కబురు వచ్చేసింది. ఈ సినిమాకి 'ఆటో జానీ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ .. మెగాస్టార్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించే అవకాశం లభించడం నిజంగా అదృష్టమేననీ, అయితే పూరీ జగన్నాథ్ కి ఈ కథమీద వున్న బలమైన నమ్మకం కూడా తాను నిర్మాతగా మారడానికి ఒక కారణమైందని అన్నాడు.

ఎన్నో ప్రత్యేకతలను .. విశేషాలను సంతరించుకున్న ఈ సినిమాలో చిన్న పాత్ర లభించినా అది తన అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. మెగాస్టార్ తో కలిసి నటించడంకంటే అదృష్టం మరొకటి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా కథ పూర్తిగా తనకి తెలుసనీ, ఇంత గ్యాప్ తరువాత మెగాస్టార్ నుంచి వచ్చే మూవీ ఎలా ఉండాలని అభిమానులంతా అనుకుంటారో, అదే స్థాయిలో ఈ సినిమా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు. చరణ్ మాటలు వింటుంటే ఆయన ఈ సినిమాలో ఏదో ఒక పాత్రలో మెరిసే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)