ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడిన రజనీకాంత్

Wed, May 13, 2015
రజనీకాంత్
రజనీకాంత్
ధనలక్ష్మి వచ్చి కాలింగ్ బెల్ కొట్టే సమయానికి కరెంట్ పోవడం కన్నా దురదృష్టం ఏముంటుంది? ఇప్పుడు అలాంటి దురదృష్టమే తనని వెంటాడుతోందని యువ దర్శకుడు రంజిత్ బాధపడుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాయే చేయబోతున్నాడు .. ఇంకా దురదృష్టం ఏంటని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ సినిమాకే ఎసరు వచ్చినట్టుగా కోలీవుడ్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. రంజిత్ కథకి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు, సూర్య హీరోగా ఒక సినిమా చేయడానికి నిర్మాత జ్ఞానవేల్ రాజాకి రంజిత్ అగ్రిమెంట్ చేశాడట. ఆ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే రంజిత్ .. ఈ సినిమా చేయడానికి వీల్లేదు.

ఇదే విషయాన్ని రజనీకాంత్ దృష్టికి కూడా జ్ఞానవేల్ రాజా తీసుకెళ్లాడట. దాంతో రజనీకాంత్ ఆలోచనలో పడినట్టు సమాచారం. ఇక మోక్షానికి మోకాలు అడ్డు తగిలినట్టు .. ఇలా జ్ఞానవేల్ రాజా అడ్డుతగలడం రంజిత్ తట్టుకోలేకపోతున్నాడు. అదృష్టం కొద్దీ వచ్చిన అరుదైన అవకాశం చేజారిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు .. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)