ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వర్మ రొమాంటిక్ చిత్రం వచ్చేస్తోంది

Mon, May 11, 2015
అనైకా సోఠి
అనైకా సోఠి
రామ్ గోపాల్ వర్మ పేరు వినబడగానే ఆయన చేసిన మాఫియా సినిమాలు .. దెయ్యాల సినిమాలు ప్రేక్షకుల కనులముందు కదలాడుతూ వుంటాయి. ఈ తరహా చిత్రాలకి ఆయన రొమాంటిక్ టచ్ ఇవ్వడం ఎప్పుడూ మరిచిపోలేదు. అలాంటి రొమాన్స్ ను ప్రధాన రసంగా తీసుకుని తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రమే '365 డేస్'. నందు .. అనైకా సోఠి నాయకా నాయికలుగా ఆయన రూపొందించిన ఈ సినిమాను, ఈ నెల 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇదే విషయాన్ని గురించి నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడారు. చాలాకాలం తరువాత వర్మ పూర్తిస్థాయిలో చేసిన రొమాంటిక్ చిత్రం ఇదని ఆయన అన్నారు. ప్రేమలోపడినప్పుడు ఒకరు చేసే పనులు మరొకరికి ఇష్టంగా అనిపిస్తాయి. పెళ్లి అయిన తరువాత అవే పనులు కష్టంగా కనిపిస్తాయి. నిజజీవితంలో ఇవి సహజంగానే కనిపించినా, అందుకు గల కారణాలను ఈ సినిమాలో వర్మ చక్కగా ఆవిష్కరించాడని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)