ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పునరాలోచనలో పడ్డ రవితేజ

Sat, May 09, 2015
రవితేజ
రవితేజ
సినిమా రంగంలో కమిట్ మెంట్స్ అన్నీ జయాపజయాలపైనే ఆధారపడివుంటాయి. ఒక దర్శకుడు సక్సెస్ లో ఉన్నాడంటే అతనితో చేయడానికి హీరోలు ఉత్సాహం చూపుతుంటారు. అదే దర్శకుడికి ఓ ఫ్లాపు వస్తే హీరోలు అతనికి దూరం జరిగిపోతారు. ప్రస్తుతం హీరో రవితేజ కూడా అలాగే ఓ దర్శకుడితో చేయాల్సిన చిత్రాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఆమధ్య 'స్వామి రారా' వంటి హిట్ చిత్రాన్ని తీసిన సుధీర్ వర్మతో ఓ సినిమా చేయాలని రవితేజ భావించాడు. ఇందుకు కథ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు పూర్తవగానే ఇది సెట్స్ కి వెళుతుందని అంతా భావించారు. అయితే, తాజాగా సుధీర్ వర్మ తీసిన 'దోచేయ్' సినిమా అపజయం పాలవడంతో, రవితేజ ఆలోచనలో పడ్డట్టు, దాంతో తాత్కాలికంగా ఈ ప్రాజక్టును పక్కన పెట్టినట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)