ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నవ్వుల పండుగ చేస్కోవలసిందే!

Thu, May 07, 2015
బ్రహ్మానందం
బ్రహ్మానందం
సిటీబస్సులో సీటు దొరక్క అవస్థపడుతున్నవాళ్లు, ఒక్కసారి బ్రహ్మానందం చేసిన ఏదో ఒక పాత్రని తలచుకుంటే చాలు.. ఎంత దూరం నిలబడినా అలసట తెలియదు. అంతటి హాస్యంతో కూడుకున్నటువంటి విభిన్నమైన పాత్రలను బ్రహ్మానందం ఎన్నింటినో పోషించాడు. తాజాగా ఆయన 'వీకెండ్ వెంకట్రావ్' గా పండగ చేస్కో సినిమాలో కనిపించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో రామ్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ .. సోనాల్ చౌహాన్ అలరించనున్నారు. ఇక ఈ సినిమాలో వీకెండ్ వెంకట్రావ్ గా బ్రహ్మానందం చేసే సందడి అంతా ఇంతా కాదని, ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చిన కోనవెంకట్ చెప్పుకొచ్చాడు.

ఫైనల్ ఎడిటింగ్ తరువాత తాను చూశాననీ, సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన అన్నాడు. బ్రహ్మానందం పాత్రను ఎప్పుడు తలచుకున్నా కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని చెప్పాడు. స్క్రీన్ ప్లే .. మాటలు అందించిన రచయితగా ఈ సినిమా తనకి ఎంతో సంతృప్తిని కలిగించిందని ఆయన అన్నాడు. ఈ నెల చివర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. కోనవెంకట్ మాటలను బట్టి ఈ సినిమాకి వెళితే నవ్వుల పండుగ చేస్కోవడం ఖాయమని అనిపించడం లేదూ!
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)