ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మనోజ్ సినిమాకి రంగం సిద్ధం!

Thu, May 07, 2015
మనోజ్
మనోజ్
దశరథ్ దర్శకత్వంలో మనోజ్ ఓ సినిమా చేయనున్నాడనే విషయం ఈ మధ్య బయటికి వచ్చింది. దశరథ్ వినిపించిన కథ మనోజ్ కి నచ్చిందనీ, త్వరలోనే ఈ సినిమా కార్య రూపాన్ని ధరిస్తుందని అన్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి మల్కాపురం శివకుమార్ ముందుకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన నిర్మించిన 'సూర్య vs సూర్య' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఆయన ప్రొడక్షన్ నెం. 2 పేరుతో ఈ సినిమాని నిర్మించనున్నాడు.

మనోజ్ పెళ్లి సందడి పూర్తయిన తరువాత, అంటే జూన్ లో ఈ కథను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో 'అటాక్' సినిమా చేస్తున్న మనోజ్ అది పూర్తి కాగానే ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడని చెబుతున్నారు. బంధాలు .. అనుబంధాల నేపథ్యంగా సాగే కథలకు ప్రాధాన్యతనిచ్చే దశరథ్, దూకుడుగా వుండే మనోజ్ ని ఎలా చూపించనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)