ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మంచువారి అతిథిగా రజనీకాంత్

Tue, May 05, 2015
రజనీకాంత్
రజనీకాంత్
మోహన్ బాబు కుటుంబం ప్రేమానురాగాలకు ప్రతీకగా కనిపిస్తుంది. సఖ్యతకీ .. సంతోషాలకి నిలయంగా అనిపిస్తుంది. అలాంటి మంచువారి కుటుంబానికి రజనీకాంత్ తో ఎంతో అనుబంధం వుంది. ఆయన మోహన్ బాబు కి అత్యంత సన్నిహితుడు .. ఆప్తుడు. అందువలన ఈ నెల 20న జరగనున్న మనోజ్ వివాహానికి రజనీ వస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'శంషాబాద్' లోని మోహన్ బాబు నివాసంలో 'సంగీత్' కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ నెల 14 నుంచి అయిదురోజుల పాటు ప్రతిరోజు సంగీత్ ను జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సంగీత్ కి హాజరైన రజనీ స్టెప్పులు వేస్తాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. పెద్దాయనగా .. ఒక గౌరవప్రదమైన అతిథిగా ఇక్కడికి వస్తోన్న ఆయన అలా చేయరని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే సంగీత్ లో రజనీ స్టెప్పులు వేస్తాడంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని ఇటు మోహన్ బాబు సన్నిహితులు .. అటు రజనీ సన్నిహితులు స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)