ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమ్మడి క్రేజ్ అలా పెరిగింది!

Mon, May 04, 2015
కంగనా రనౌత్
కంగనా రనౌత్
చిత్రపరిశ్రమలో జరిగే విచిత్రాలు మరెక్కడా జరగవని ఆ రంగానికి సంబంధించిన వాళ్లు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. నిజమేననుకోవడానికి నిదర్శనంగా చాలా సంఘటనలు కనిపిస్తుంటాయి. అలాంటి విచిత్రాలను అనుభవంలోకి తెచ్చుకున్న కథానాయికగా కంగనా రనౌత్ కనిపిస్తుంది. తెలుగులో ప్రభాస్ జోడీగా 'ఏక్ నిరంజన్' చిత్రంలోనూ .. జయం రవి సరసన 'దామ్ ధూమ్' అనే తమిళ చిత్రంలోనూ నటించింది. అయినా అమ్మడి కెరియర్ ఇక్కడ ఆశాజనకంగా లేకపోవడంతో, బాలీవుడ్ పైనే పూర్తి దృష్టి పెట్టింది.

'క్రిష్ 3' చిత్రం మోగించిన విజయదుందుభితో, కెరియర్ పరంగా కంగనా జాతకమే మారిపోయింది. ఇక ఆ తరువాత వచ్చిన 'క్వీన్' చిత్రం ఆమెకి జాతీయ అవార్డును తెచ్చిపెట్టడంతో, ఇప్పుడు దర్శక నిర్మాతల దృష్టి ఆమె మీద పడింది. హిందీలోనే కాదు .. తెలుగు .. తమిళ్ నుంచి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని కంగనా స్వయంగా చెప్పింది. దక్షిణాదిన అగ్రస్థానంలో వున్న యువ కథానాయకుల జోడీగా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నా, ప్రస్తుతం ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదట. చిత్రపరిశ్రమలోనేకాదు .. ఎక్కడైనా అవకాశాలను వెతుక్కుంటూ వెళితే వుండే విలువ వేరు ... అవకాశాలను గుమ్మం దాకా తీసుకురాగలిగితే కలిగే గౌరవం వేరు. ప్రస్తుతం ఆ గౌరవంలోని ఆనందాన్ని కంగనా అనుభవిస్తోందన్న మాట!
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)