ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మధుశాలినికి మరో లక్కీఛాన్స్ !

Mon, May 04, 2015
మధుశాలిని
మధుశాలిని
తెలుగు తెరపై మెరిసే అందమైన అభినయంగా 'మధుశాలిని' కనిపిస్తుంది. చక్కగా .. చలాకీగా సందడి చేసే ఈ హైదరాబాద్ అమ్మాయి ఇప్పుడిప్పుడే తెలుగులో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమెకి ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న ఓ సినిమాలో కథానాయికగా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 'చందమామ కథలు' సినిమాతో దర్శకుడిగా వెలుగులోకి వచ్చిన ప్రవీణ్ సత్తారు, ఆసక్తికరమైన నేపథ్యంతో మరో సినిమా చేస్తున్నాడు. తాను సిద్ధం చేసుకున్న కథకి తగిన నటీనటులను ఎంచుకునే పనిలో ఆయన ప్రస్తుతం బిజీగా వున్నాడు.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం మధుశాలినిని ఎంపిక చేసిన ఆయన, త్వరలోనే మిగతా నటీనటుల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లనున్నాడు. చక్కని కనుముక్కుతీరు కలిగిన మధుశాలిని ఆడియన్స్ హృదయాలను దోచుకోవడంలో ఆలస్యం చేయదని అంటున్నారు. వైవిధ్యానికి పెద్దపీట వేసే ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న ఈ సినిమా గనుక సక్సెస్ అయితే, ఇక మధుశాలిని మరింత బిజీ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)