ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తనచుట్టూ తిరిగే కథలో త్రిష!

Mon, May 04, 2015
త్రిష
త్రిష
కొత్త సినిమాల ఫస్ట్ లుక్ .. టీజర్ .. ఆడియో రిలీజ్ వంటి సినిమాల వేడుకలను ఆయా నటీనటుల పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేయడమనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. తాజాగా 'త్రిష' విషయంలోనూ 'నాయకి' సినిమా దర్శక నిర్మాతలు ఇదే పద్ధతిని పాటించారు. ఈ రోజున త్రిష పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'నాయకి' సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో త్రిష నాజూకుదనానికి నమూనాగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని బట్టి .. టైటిల్ ని బట్టి ఇది కథానాయకి ప్రాధాన్యత కలిగిన చిత్రమని తెలుస్తోంది.

పాత్రపరంగా త్రిష వేషధారణ చూస్తుంటే, ఒక నాట్యగత్తెగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగ్ దశలో వుంది. గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'గోవి' దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకూ కథానాయకులతో ఆడిపాడిన పాత్రల్లో మాత్రమే కనిపించిన త్రిష, తన చుట్టూ తిరిగే కథా వస్తువును ఎంత సమర్థవంతంగా నడిపిస్తుందో, అభిమానులను ఎంతవరకూ మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)