ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అభిమాన హీరోకి వెరైటీ కానుక

Fri, May 01, 2015
శింబు
శింబు
మన నితిన్ కి పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అభిమానం. 'నేను పవన్ అభిమానిని' అని చాలా గర్వంగా చెబుతుంటాడు. తమిళంలో కూడా ఇలాంటి హీరో ఒకరున్నారు. అతనే శింబు! అజిత్ అంటే శింబు పడి చేస్తాడు. తన అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తుంటాడు. అలాగే, ఈ రోజు (మే 1) తన అభిమాన కథానాయకుడి జన్మదినం సందర్భంగా తాను నటించిన 'వాలు' చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించాడు. అయితే, అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో కేన్సిల్ అయింది. దీంతో ఈ రోజు 'వాలు' సినిమా స్పెషల్ టీజర్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తూ తన అభిమాన హీరోకి కానుకగా అందిస్తున్నాడు!
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)