ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్టిమేట్ స్టార్ ఆయనేనట!

Thu, Apr 30, 2015
అజిత్
అజిత్
అటు ఉత్తరాది ... ఇటు దక్షిణాది చిత్రపరిశ్రమకి సంబంధించి వివిధ అంశాలపై ఎప్పుడూ ఏవో సర్వేలు జరుగుతూనే వుంటాయి. ఆ సర్వేలలో ఉత్సాహంగా పాల్గొనేవాళ్లు ... వాటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు ఎక్కువగానే వుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియా సంస్థ బాలీవుడ్ లైఫ్, సౌత్ ఇండియన్ అల్టిమేట్ స్టార్ ఎవరు? అనే విషయంపై ఇటీవల ఆన్ లైన్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అజిత్ కి మొదటిస్థానం .. విజయ్ కి రెండవస్థానం లభించిందట.

రజనీకాంత్ .. కమల్ .. మమ్ముట్టి .. మోహన్ లాల్ .. పవన్ .. మహేష్ .. వంటి కథానాయకులకి తక్కువ ఓట్లు వచ్చాయట. వీళ్లందరూ మహామహులే ... హేమాహేమీలే. అందువలన ఆన్ లైన్ సర్వేలను బట్టి హీరోల స్థానాలను అంచనా వేయలేమనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అజిత్ .. విజయ్ అభిమానులకు ఈ సర్వే సంతోషాన్ని కలిగించినా, మిగతా వాళ్లు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)